Basic Info: Telugu

టిడబ్ల్యుసి2 (TWC2)  అంటే ఏమిటి?

ట్రాన్సియంట్ వర్కర్స్ కౌంట్ టూ (TWC2),  సింగపూరులోని   లాభాపేక్ష లేని ఒక  ప్రభుత్వేతర  ధర్మాదాయ సంస్థ. ఈ సంస్థలో భాగంగా మేము ఉద్యోగ రీత్యా సమస్యలను ఎదుర్కొంటున్న  ప్రవాస  కార్మికులకు  సహాయాన్ని అందచేస్తున్నాము. స్వచ్ఛంద సేవ సంస్థగా అందించే  మా సేవలకు ఎటువంటి రుసుము తీసుకొనబడదు.

మేము మానవ వనరుల మంత్రిత్వ శాఖ (MOM) తో సన్నిహితంగా కలిసి పని చేస్తూ  మీ సమస్యలకు  అనువైన పరిష్కారం కోసం కృషి చేస్తాము. అన్ని కేసులు, సమస్యలు విజయవంతంగా పరిష్కరించబడలేవు, కానీ మా సహకారంతో సాధ్యమయ్యే  అన్ని పరిష్కారాలు అన్వేషింపబడగలవు/ప్రయత్నింపబడగలవు.

మా సహాయం ఎవరికి

TWC2 సింగపూరులో పని చేస్తున్న ప్రవాస కార్మికులందరికీ సహాయ పడుతుంది. ఇది  వర్క్ పర్మిట్ లు, S -పాస్ మీద ఉన్న వారికి కూడా వర్తిస్తుంది.

చట్టంపై అవగాహన

ప్రవాస కార్మికులకు సాధారణంగా పరదేశం లోని చట్టం పై పూర్తి గ్రహింపు ఉండదు. కానీ TWC2 కున్న అవగాహనతో,  మేము 2004 సంII నుండి కార్మికులకు సహాయపడుతున్నాము.  మేము మీ హక్కులపైన, మీకున్న అవకాశములపైన, మీ కేసు నడిచే  ప్రక్రియ పైన సలహాలు అందించగలము.

లాయర్ల అవసరం లేదు

చట్టం గురించి తెలిసి ఉండటం  ముఖ్యమైనప్పటికీ, ఉద్యోగ రీత్యా ఎదురయ్యే సమస్యలకు మీరు  న్యాయవాదులను ఆశ్రయించ వలిసిన పని లేదు. సాధారణంగా ఉద్యోగసమస్యలు కోర్టుల్లో కాకుండా  MOM ద్వారా పరిష్కారం అవుతాయి. కనుక  న్యాయవాది  అవసరం లేదు. TWC2, మీ హక్కుల సాధనకు అవసరమైన  పూర్తి సమాచారం అందివ్వడం తో  పాటు  MOM తో మీరు సంప్రదించుటకు అవసరమైన  సహాయాన్ని అందిస్తుంది.   TWC2 మీకు ఉచితంగా సహాయం అంద  చేస్తుంది.

అదే  న్యాయవాదులు అయితే  తమ సేవలను అందించడానికి చాలా డబ్బు వసూలు చేస్తారు.

మేము ఎలా సహాయపడుతాము

ప్రవాస కార్మికులు ఎదుర్కునే మూడు సాధారణ సమస్యలు:

  • జీతాలు చెల్లించకపోవడం
  • కాంట్రాక్టు (ఒప్పందపు) వివాదాలు
  • గాయాలు

జీతాలు చెల్లించకపోవడం

మీకు జీతం చెల్లింపబడని సందర్భాల్లో, మీ ఉద్యోగాధికారి  మీకు చెల్లించాల్సిన సరైన జీతం యొక్క సాక్ష్యాలను ఎలా పొందాలో TWC2 మీకు సలహా ఇవ్వగలదు. మీ ఉద్యోగపు యజమాని మీకు ఎంత రుణపడి ఉంటారో లెక్కించడానికి మేము మీకు సహాయం చెయ్యగలము. మీకు రావాల్సిన జీతంలో ఓవర్ టైం జీతం, సెలవు రోజుల పని జీతం  మరియు వార్షిక సెలవులు  ఉంటాయి. ఈ వివరాలన్ని మీరు చట్టంలోని ప్రకారం సరిగ్గా లెక్కించగలగాలి. అట్టి పరిస్థితులలో  TWC2 మీకు సహాయపడగలదు. MOM మీకు రావాల్సిన జీతం  లెక్కించినప్పటికీ, కొన్నిసార్లు పొరపాట్లు దొర్ల వచ్చు. TWC2 మీ కోసం ఆ లెక్కను  సరి చూడగలదు.

ఆ పైన  మీకు, మీ ఉద్యోగపు యజమానికి మధ్య MOM వద్ద సమావేశాలు ఉంటాయి. మీ కేసును మీరు  ఎలా వాదించాలో మరియు సాక్ష్యాలను ఎలా సమర్పించాలో మేము మీకు వివరంగా నేర్పగలము .

యజమాని అప్పటికీ  చెల్లించకపోతే, MOM వద్ద ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మేము మీకు సహాయం చేస్తాము.

మీరు  కొత్త ఉద్యోగం  చూసుకోవాలని కూడా ఆశించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం MOM  అనుమతి పొందడానికి  TWC2 మీకు సహాయం చేస్తుంది. మీరు కొత్త ఉద్యోగం చూసుకునే   ముందు మీరు ఆ అనుమతిని తెచ్చుకోవాలి .

కానీ, TWC2 ఉపాధి ఏజెంట్ కాదు (మాకు ఆ లైసెన్స్ లేదు), కానీ MOM నుండి అనుమతి పొందడానికి మేము మీకు సహాయపడగలము.

కాంట్రాక్టు (ఒప్పందపు) వివాదాలు

సింగపూరు లో చాలా దస్తావేజులు (డాక్యుమెంట్లు) ఆంగ్లంలో వ్రాయబడి ఉంటాయి. అవి మీకు అర్థం కావడానికి కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీ ఉద్యోగపు ఒప్పందపు  (ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు) వివరాలు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండకపోవచ్చు. TWC2 ఆ ఒప్పందాన్ని జాగ్రత్తగా   చదివి మీకు వివరంగా తెలియపరచగలదు.

ఒప్పందపు పత్రంలో వివరాల గురించి మీకు ఏ విధమైన  వివాదం ఉన్నప్పుడు,  మీ హక్కులు ఏమిటో మేము మీకు సలహా ఇవ్వగలము  మరియు దాన్ని పరిష్కరించడానికి  మార్గాన్ని సూచించగలము.

ఉదాహరణకు, కొంతమంది కార్మికులు రాజీనామా చేసి స్వదేశంలోని ఇంటికి వెళ్లాలని కోరుకుంటారు, కాని రాసుకున్న కాంట్రాక్టు  ఒప్పందం దానిని అనుమతిస్తుందా? మరి  కొంత మంది కార్మికులు రోజులో  చాలా ఎక్కువ గంటల పాటు, కొన్ని సార్లు వారంలో ఏడు రోజులు పని చేయింపబడుతారు. అయినప్పటికీ  అది ఒప్పందం ప్రకారం  సరైనదే అని కొందరు యజమానులు వాదిస్తారు. మీరు TWC2 దగ్గరకు వస్తే మేము అట్టి  మీ సమస్యలకు  పరిష్కారం కనుగొనడంలో సహాయం చేస్తాము.

గాయాలు

వృత్తి రీత్యా గాయపడటం చాలా తీవ్రమైన సమస్య. మీరు పని చేయలేక పోవడమే కాకుండా, మీకు వైద్య చికిత్స అవసరం అవుతుంది. వైద్య చికిత్స, సింగపూర్‌లో చాలా ఖరీదు. మీ యజమాని మీకు వైద్య చికిత్స అందించకపోతే, మీరు ఏమి చేయగలరు? TWC2, చట్టం ప్రకారం, మీ హక్కుల గురించి మీకు సలహా ఇచ్చి, మీరు  మీకు అవసరమైన వైద్య చికిత్స పొందడానికి మీకు సహాయం చేస్తుంది.

మీ పని ప్రదేశంలో అయిన గాయాలతో  మీకు శాశ్వత అంగవైకల్యం కలిగినట్లైతే, మీరు నష్ట పరిహారానికి అర్హులు అవుతారు. ఆ నష్ట పరిహారం చెల్లింపు  ప్రక్రియ పైన  మరియు మీకున్న మార్గాల పైన  TWC2 మీకు సలహా ఇస్తుంది.

నష్ట పరిహారం పొందడం కొరకు చాలా మంది కార్మికులు, న్యాయవాదులను నియమించుకుంటారు. ఇది పూర్తిగా అనవసరం. పైపెచ్చు, న్యాయవాదులు  తన రుసుముగా లభించే నష్ట  పరిహారంలో కొంత భాగాన్ని తీసుకుంటారు. అందువల్ల మీకు  పరిహారం తక్కువ అందుతుంది.

మమ్మల్ని ఎలా సంప్రదించాలి:

1. మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల  నుండి రాత్రి 9 గంటల   వరకు +65 6297 7564 లేదా 1800 888 1515 కు కాల్ చేయవచ్చు.

2. మీరు ఏ సమయంలోనైనా  +65 6297 7564 కు వాట్సాప్ సందేశాన్ని పంపవచ్చు.

3. మా కార్యాలయం  ఫోన్ నంబర్ +65 6247 7001 సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల  నుండి సాయంత్రం 6 గంటల  వరకు.

4. మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల  నుండి సాయంత్రం 5 గంటల  వరకు మా కార్యాలయానికి కూడా రావచ్చు.

మా చిరునామా

ట్రాన్సియంట్ వర్కర్స్ కౌంట్ టూ
5001 బీచ్ రోడ్, # 09-86
గోల్డెన్ మైల్ కాంప్లెక్స్
సింగపూర్ 199588.

దగ్గరలో ఉన్న   యం. ఆర్. టి.   స్టేషన్లకై  ఈ  క్రింది పటం (మ్యాప్) చూడండి

What is TWC2?

Transient Workers Count Too (TWC2) is a non-government charity organisation in Singapore. We assist foreign workers who are facing difficulties in relation to their employment in Singapore. We do not charge for our assistance.

We work closely with the Ministry of Manpower (MOM) to get the best possible solution for your case. Not all cases can be solved successfully, but with our help, all possible solutions will be explored/tried.

Who we help

TWC2 provides assistance to all foreigners working in Singapore. This includes those on Work Permits and S-Passes.

Need to know the law

Foreign workers usually do not know the law. But TWC2 knows, and we have been helping workers since 2004. We can advise you what your rights are, what your options are, and what the process will be for your case.

No need for lawyers

Although it is important to know the law, you do not need to engage a lawyer for employment problems. Employment problems are not usually solved through the courts but solved through MOM. That is why no lawyer is needed. Instead, TWC2 will give you all the information you need to fight for your rights, and help you communicate with MOM. TWC2 will help you for free.

Lawyers, on the other hand, will charge you a lot of money for their services.

How we help

The three most common types of problems faced by foreign workers are:

  • Salary non-payment
  • Contract disputes
  • Injury

Salary non-payment

In cases of salary non-payment, TWC2 will advise you how to get evidence of the correct salary that the employer should have paid you. Then we will help you calculate exactly how much your employer owes you. This includes overtime pay, holiday pay and annual leave. You must calculate correctly using the formula in the law, and this is where TWC2 can assist you. Even if MOM calculates for you, sometimes a mistake is made, and TWC2 will check the calculation for you.

Then there will be meetings at MOM between you and your employer. We will teach you how to argue your case and how to present evidence.

If the employer still does not pay, we will help you take the matter further at MOM.

You may also want to get a new job. TWC2 will help you ask MOM for permission to look for a new job. You need to get that permission before you can do so.

However, TWC2 is not an employment agent (we do not have a licence), but we can help you get the permission from MOM.

Contract disputes

Many documents in Singapore are written in English. You may find it difficult to understand what they say. For example, you may have an employment contract and you are not sure about the details. TWC2 will read it carefully and explain it to you.

If you have some dispute about a detail in the document, we can advise you what your rights are, and suggest a way to solve it.

For example, some workers just want to resign and go home, but does the contract allow it? Other workers find that they are made to work very long hours, seven days a week, and the boss says it is in the contract. Come to TWC2 and we will help you find a solution.

Injury

Suffering an injury is a very serious problem. Not only will you not be able to work, you need medical treatment which is very expensive in Singapore. If your employer does not provide you with medical treatment, what can you do? TWC2 will advise you about your rights under the law, and help you get the medical treatment you need.

An injury that took place at work and that leaves you with a permanent disability will be eligible for compensation. TWC2 will advise you what the process is and what your options are.

Many workers engage lawyers for this. It is completely unnecessary. Furthermore, the lawyer will take part of the compensation as his fee. This means that you will get less.

How to find us

  1. You can call +65 6297 7564 or 1800 888 1515 on Mondays to Fridays from 9am to 9pm.
  2. You can send a WhatsApp message to +65 6297 7564 anytime.
  3. Our office phone number is +65 6247 7001 on Mondays to Fridays from 9am to 6pm.
  4. You can also come to our office on Mondays to Fridays from 9am to 5pm.

Our address is

Transient Workers Count Too
5001 Beach Road, #09-86
Golden Mile Complex
Singapore 199588.

See the map below, which also shows the nearest MRT stations.